మాజీ మంత్రి మాణిక్యాలరావు దీక్ష భగ్నం

మాజీ మంత్రి మాణిక్యాలరావు దీక్ష భగ్నం

మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధికి హామీలిచ్చి అమలు చేయకుండా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఈనెల 21 నుంచి దీక్షను చేస్తున్నారు. పోలీసులు ఆయన ఆరోగ్యం దృష్ట్యా దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే దేనికైనా సిద్ధమేనని, ప్రభుత్వం మెడలు వంచి అయినా హామీలు నెరవేర్చుకుంటామని హెచ్చరించారు. స్థానిక టీడీపీ నేతల కుతంత్రాలు కారణంగానే నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను  చంద్రబాబు కావాలనే అమలు చేయడం లేదని మాణిక్యాలరావు విమర్శించారు.