రోజాకు సీఎం జగన్ పిలుపు.. ఇచ్చే పదవి ఇదే..!?

రోజాకు సీఎం జగన్ పిలుపు.. ఇచ్చే పదవి ఇదే..!?

కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురై వెళ్లిపోయిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు అమరావతి రావాల్సింది పిలుపు అందింది. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి తాడేపల్లి బయల్దేరిన రోజా... కాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. కేబినేట్‌లో చోటు దొరకకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రోజా.. మంత్రుల ప్రమాణస్వీకారానికి కూడా వెళ్లలేదు. ఈ క్రమంలో రోజాను అమరావతికి పిలిపించి మాట్లాడనున్నారు సీఎం జగన్. వైసీపీలో కీలకంగా పనిచేసిన రోజాకు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలనే యోచనలో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ పదవి తీసుకోడానికి రోజా విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రోజాను నియమిస్తే వచ్చే న్యాయ సమస్యలు ఏంటి అనేదానిపై సలహాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రోజాను నియమించేందుకు సిద్ధమైన సీఎం జగన్... రోజాను బుజ్జగించే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా రోజా పదవిపై ఇవాళ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, వచ్చే కేబినెట్‌లో రోజాకు కచ్చితంగా పదవి దక్కుతుంది అంటున్నాయి వైసీపీ వర్గాలు.