కబడ్డీ ఆడిన ఫైర్ బ్రాండ్ రోజా

కబడ్డీ ఆడిన ఫైర్ బ్రాండ్ రోజా

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా కబడి ఆడారు. నిండ్రలో ఆదివారం అంబేద్కర్ సెలెక్ట్  7వ సంవత్సరం కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించారు. రెండు మున్సిపాలిటీలు గల నియోజకవర్గంగా నగిరిలో ఎమ్మెల్యే ఆర్.కె. రోజా  స్వయంగా ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ఆదివారం ఆమె కబడి ఆడి ఆశ్చర్యంలో ముంచారు. ఈ సంఘటన నిండ్ర మండలంలో జరిగింది. నిండ్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన అంబేద్కర్ సెలెక్ట్ 7వ సంవత్సరం కబడ్డీ టోర్నమెంట్ పోటీల ప్రారంభించడానికి ఉదయం విచ్చేశారు. అయితే తిరువేలంగాడు - రేణిగుంటల మధ్య రసవత్తర పోరు జరుగుతున్న నేపథ్యంలో నగరి  ఎమ్మెల్యే రోజా ఒక సారి రేణిగుంట తరపు నుంచి మరో సారి తిరువేలంగాడు జట్ల తరపు నుంచి కబడ్డీ ఆడి ప్రేక్షకులను అలరించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్న రోజా కబడ్డీ మన భారతదేశపు క్రీడ అని క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.