కాలేజీ సీక్రెట్ ను బయటపెట్టిన రోజా.. 

కాలేజీ సీక్రెట్ ను బయటపెట్టిన రోజా.. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా చిత్తూరు జిల్లాలోని ఓ కాలేజీ ఫంక్షన్ కు హాజరైంది.  అక్కడి విద్యార్థులతో ముచ్చటించింది.  ఇప్పటి విద్య గురించి, అప్పటి విద్యగురించి ఆమె మాట్లాడింది.  తాను ఇంటర్ వరకే చదువుకున్నని, ఇంటర్ తరువాత తనకు సినిమా ఆఫర్ రావడంతో సినిమాల్లోకి వెళ్లినట్టు చెప్పింది.  ఇప్పటి పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారని, ప్రస్తుతం చదువులు మార్కులపై ఆధారపడి ఉన్నాయని రోజా చెప్పింది.  

ఇప్పటి పిల్లలు రోజుకు 12, 13 గంటలు చదువుతున్నారని, ఇప్పటి పిల్లల్లా రోజుకు 12 గంటలు చదవడం తనవల్ల కాదని, అందుకే కాలేజీ ఫంక్షన్లకు వెళ్ళాలి అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తానని రోజా చెపింది.  రోజా చిత్తూరులోని పద్మావతి ఉమెన్స్ కాలేజీలో బైపీసీలో ఇంటర్ చదివినట్టు తన అఫిడవిట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.