గన్ కంటే ముందే జగన్ వస్తాడు 

గన్ కంటే ముందే జగన్ వస్తాడు 

దేశ వ్యాప్తంగా దిశ ఘటన మారుమ్రోగిపోతున్నది.  మొన్నటి వరకు పార్లమెంట్ ను కుదిపేసిన ఈ ఎన్ కౌంటర్ ఇప్పుడు ఏపి అసెంబ్లీని కుదిపేసింది.  ఏపి అసెంబ్లీలో ఈ విషయంపై చర్చించారు. జగన్ ఈ విషయంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు చట్టాలు కఠినం చేయాలని అన్నారు. తెలంగాణ పోలీసులను ఈ సందర్భంగా అభినందించారు.  

ఇక దిశపై అత్యాచారం, హత్య విషయంపై వైకాపా ఎమ్మెల్యే రోజా స్పందించింది.  మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోతుందని అన్నారు.  కేవలం సినిమాల్లోనే మహిళలకు న్యాయం జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.  బాహుబలి సినిమాలో సేనాపతి తన భార్యపై చేయి వేసిన వ్యక్తి తలను ఖండించిన సమయంలో మహిళలు ఎంతగా సంతోషం వ్యక్తం చేశారో చూశానని అన్నారు.  మహిళలకు ఇబ్బందులు ఎదురైనపుడు గన్ కంటే ముందు జగన్ వస్తారని, ఏపీలో అలా చట్టాలు మార్చాలని అన్నారు.  అదే విధంగా పవన్ పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది రోజా.  రెండు బెత్తం దెబ్బలు కొట్టినంత మాత్రానా సరిపోదని, అలాగైతే... తన అన్న కూతురి విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు గన్ పట్టుకొని హంగామా చేశారని అన్నారు.