ఎమ్మెల్యే సీతక్క కారు ఢీ, చిన్నారి మృతి

ఎమ్మెల్యే సీతక్క కారు ఢీ, చిన్నారి మృతి

ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత సీతక్క ప్రయాణిస్తున్న కారు ఓ బైక్‌ను ఢీకొట్టింది. మంగపేట జీడివాగు దగ్గర  జరిగిన ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. ఏటూరునాగారం మండలం జీడీ వాగు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ ను ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రెడేళ్ల చిన్నారి, తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ఏటూరు నాగరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా... చిన్నారి మృతిచెందింది. తీవ్రగాయాలపాలైన ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.