స్పీకర్‌గా తమ్మినేని సీతారాం..?

స్పీకర్‌గా తమ్మినేని సీతారాం..?

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ముగిసిన తర్వాత తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు తమ్మినేని సీతారాం... ఈ సమావేశంలో స్పీకర్  పదవిపై చర్చించినట్టు సమాచారం. తమ్మినేని సీతారాం.. ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. సీతారాం... కళింగ (బీసీ) సామాజికవర్గానికి చెందిన వారు. తొలిసారి 1983లో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తమ్మినేని.. ఇప్పటి వరకు ఆరు సార్లు ఆదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజంయ సాధించారు. ఇక 1985లో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన ఆయన.. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మున్సిపల్ మంత్రిగా కూడా పనిచేశారు.