ముంబై హోటల్ ముందు కర్ణాటక రాజకీయం

ముంబై హోటల్ ముందు కర్ణాటక రాజకీయం

రాజీనామాలు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ హోటల్‌లో మకాం పెట్టారు.  దీంతో కన్నడ రాజకీయానికి ముంబై కేంద్రమైంది.  అసమ్మతి ఎమ్మెల్యేల్లో కొంతమందినైనా బుజ్జగిస్తే రాజీనామా ఉపసంహారణ చేసుకునేలా చేస్తే ప్రభుత్వం గండం నుండి గట్టెక్కుతుందని కాంగ్రెస్, జీడీఎస్ నేతలు భావించారు.  

ఇందుకోసం రాయబారానికి కాంగ్రెస్ నేత, మంత్రి డీకే శివకుమార్, జీడీఎస్ ఎమ్మెల్యే శివలింగ గౌడను ముంబై పంపారు.  వీరిద్దరూ హోటల్ వద్దకు చేరుకొని లోపలున్న ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం చేయడంతో పోలీసులు వాటికి అడ్డుపడ్డారు.  లోపలున్న ఎమ్మెల్యేలు తమకు ప్రాణహాని ఉందని,  భద్రత కల్పించాలని కోరడంతో వారిని హోటల్‌లోకి వెళ్లనీయలేదు.  దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ఈ సందర్బంగా శివకుమార్ మాట్లాడుతూ స్నేహితులను కలిసేందుకే ఇక్కడకు వచ్చానని, అంతా బాగానే జరుగుతోందని, టెంక్షన్ పడాల్సిన పనిలేదని అన్నారు.