కాంగ్రెస్‌, జేడీఎస్‌కు ఎమ్మెల్యేలు ఝలక్‌!

కాంగ్రెస్‌, జేడీఎస్‌కు ఎమ్మెల్యేలు ఝలక్‌!

కర్ణాటక రాజకీయం రసకందాయకంలో పడింది. ఇవాళ కాంగ్రెస్‌ నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరవడం సంచలనంగా మారింది. విజయనగర ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌, కూడ్లగి ఎమ్మెల్యే నాగేంద్ర, అమ్నాబాద్‌ ఎమ్మెల్యే పాటిల్‌, భీమా నాయక్‌, అమెర్‌ గౌడ్‌లు ఈ సమావేశానికి డుమ్మ కొట్టారు. కనీసం వీరెవరూ  అధిష్టానంతో టచ్‌లో కూడా లేకపోవడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. మరోవైపు..  జేడీఎస్‌ నేత కుమారస్వామికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు షాకిచ్చారు. కొద్ది సేపటి క్రితం బెంగళూరులో ప్రారంభమైన జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశానికి రాజా వెంకటప్ప నాయక, వెంకటరావుగౌడ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.  బీజేపీకి మద్దతుగా వెళ్లేందుకే వాళ్లు సమావేశానికి రాలేదన్న ప్రచారం జోరందుకున్నది.