శివసేనకు భారీ షాక్ - ఎన్సీపీతో దోస్తీని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు 

శివసేనకు భారీ షాక్ - ఎన్సీపీతో దోస్తీని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు 

రేపు మధ్యాహ్నంలోగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై ఓ కొలిక్కి వస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే శివసేనకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఎన్సీపీతో కలిసేందుకు సిద్ధంగా లేరని, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.  విభేదిస్తున్న 17 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు.  

శివసేన చీఫ్ ను కలిసి తమ గోడును చెప్పుకోవాలని అనుకుంటున్నారు. అటు ఢిల్లీలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నాయి.  అక్కడ అలా చర్చలు జరుగుతున్న సమయంలో మహారాష్ట్రలో ఇలా 17 మంది శివసేన ఎమ్మెల్యేలు శివసేనతో కలిసేందుకు వ్యతిరేకించడంతో మహా రాజకీయం కొత్త మలుపు తిరిగింది.