ఎమ్మెల్సీ అనర్హత పిటిషన్ జూన్ 6కి వాయిదా

ఎమ్మెల్సీ అనర్హత పిటిషన్ జూన్ 6కి వాయిదా

ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ముగ్గురూ కాంగ్రెస్‌లో చేరినట్లు ఆధారాలు, ఇతర రికార్డులు సమర్పించి.. వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు న్యాయస్థానాన్ని కోరారు. అదనపు ఏజీ వాదనతో అంగీకరించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం... విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. అయితే జూన్ 3 వరకు ఆ మూడు స్థానాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.