మాక్‌పోలింగ్‌ పూర్తి...

మాక్‌పోలింగ్‌ పూర్తి...

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మాక్ పోలింగ్ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పూర్తయింది. ఎమ్మెల్యే కోటా కింద జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ లో పాల్గొనే ఎమ్మెల్యేలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ అనంతరం తెలంగాణ భవన్‌ నుంచి ప్రత్యేక బస్సులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి చేరుకుని ఓటు వేయనున్నారు. సోమవారం కూడా ఓటుహక్కు వినియోగించుకోవడంపై ఎమ్మెల్యేలకు మాక్‌ పోలింగ్‌‌ కార్యక్రమాన్ని చేపట్టారు.