ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ..!

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ..!

తెలంగాణలో ఇవాళ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్ర 4 వరకు పోలింగ్ జరగనుండగా.. అనంతరం సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండగా... ఐదుగురు అభ్యర్థులతో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం నామినేషన్‌ వేయించాయి. అయితే, తమకున్న సీట్ల ప్రకారం ఓ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నా... ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ కాంగ్రెస్ నేతలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ విప్‌ జారీ చేయగా... కాంగ్రెస్ దారిలోనే టి.టీడీపీ కూడా అదే నిర్ణయం తీసుకుంది.. నేడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓటింగ్‌లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఓటింగ్‌లో పాల్గొన‌వ‌ద్దని టీడీపీ ఎమ్మెల్యేల‌ను ఆదేశించారు పార్టీ అధ్యక్షులు ఎల్‌.ర‌మణ‌.. కేసీఆర్ అనైతిక‌, రాజ్యాంగ విరుద్దంగా, అక్రమ ప‌ద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ప్రయ‌త్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే, కాంగ్రెస్, టీడీపీ ఎన్నికలు బహిష్కరించడంతో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.