మండలిలో జీవన్ రెడ్డి, హరీష్ రావుల మధ్య వాగ్వివాదం

మండలిలో జీవన్ రెడ్డి, హరీష్ రావుల మధ్య వాగ్వివాదం

తెలంగాణ శాసన మండలిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదాపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి హరీష్ రావు మధ్య వాగ్వివాదం జరిగింది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తులు రాలేదని రాజ్యసభ లో కేంద్ర మంత్రి ప్రకటించినట్లు సభ దృష్టికి తెచ్చారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా దక్కని పాపం అంతా కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి హరీష్ రావు విమర్శించారు. విభజన చట్టంలో పోలవరంకు జాతీయ హోదా ఇచ్చి, ప్రాణహిత చేవెళ్లను ఎందుకు విస్మరించారని నిలశారు. స్వయంగా సీఎం కేసీఆర్ ప్రధానిని కలిసి అన్ని ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేశారని సభలో ప్రస్తావించారు. అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖలు రాశామని, అన్ని ప్రయత్నాలను కేంద్రం బేఖాతరు చేసిందని అన్నారాయన. ఇక శాసనమండలి రేపటికి వాయిదా పడింది.