తెలంగాణకు అన్యాయం జరిగింది : కర్నె ప్రభాకర్

తెలంగాణకు అన్యాయం జరిగింది : కర్నె ప్రభాకర్

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే మాట్లాడలేదన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపారు. కానీ కేంద్రం స్పందించలేదని, ట్రిబ్యునల్ కు డైరెక్షన్ కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ లు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. పెండింగులో ఉండగానే పోతిరెడ్డిపాడు ద్వారా అదనపు నీటిని తరలించేందుకు ఏపీ జీవో ఇచ్చిందని తెలిపారు. ఏపీ తెచ్చిన జీవోల వల్లనే తెలంగాణ కు అన్యాయం జరుగుతుందని సుప్రీం కోర్టులో కేసు వేశామని తెలిపారు. కానీ విపక్షాలు ఏపీతో పంచాయితీ అయితే కర్ణాటక మీద కేసు వేశారని తప్పుదారి పట్టిస్తున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ చేసిన పాపాలను తాము కడిగే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు.