టీడీపీకి షాక్.. గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్సీ..

టీడీపీకి షాక్.. గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్సీ..

సార్వత్రిక ఎన్నికలకు సమీపిస్తున్న సమయంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గుడ్‌బై చెప్పారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ సీఎం చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు రాజీనామా లేఖను ఫ్యాక్స్ చేశారు మాగుంట. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారాయన. మాగుంట శ్రీనివాసులు రెడ్డి రేపు వైసీపీలో చేరే అవకాశం ఉంది. కాగా, కొన్నిరోజులుగా అసంతృప్తితో ఉన్న మాగుంటను టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీ నేతలు బుజ్జగించారు. కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఆయన.. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా కలిశారు. అయితే, అది మార్యదపూర్వక భేటీయే నని ఆయన ప్రకటించారు. కాగా, ఇవాళ టీడీపీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు మాగుంట.