సినిమాల్లో అవకాశాలు లేక వైసీపీలో చేరిక !

సినిమాల్లో అవకాశాలు లేక వైసీపీలో చేరిక !

గత రెండు నెలలుగా పలువురు సినీ నటులు, రచయితలు వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే.  తాజాగా ఈరోజు కూడా నటుడు రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత, నటి హేమ, యాంకర్ శ్యామల కూడా వైకాపా కండువా కప్పుకున్నారు.  ఈ చేరికలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సినిమాల్లో అవకాశాలు లేనివారే వైకాపాలో చేరుతున్నారని అన్నారు. 

వారంతా కాల్ షీట్లు అమ్ముకుని వైకాపాకు ప్రచారం చేయడానికి వస్తున్నారు, ఎన్నికలయ్యాక ఎవరో కనిపించరని విమర్శించారు.  అలాగే 'వైసీపీకి స్టార్ క్యాంపెయినరుగా మోడీ.. మోడీకి స్టార్ క్యాంపెయినరుగా జగన్ ప్రచారం చేసుకుంటున్నారు.  ఒకరి డప్పు ఒకరు కొడదాం అని జగన్ మోడీ మధ్య ఎంఓయూ ఉంది.  కర్నూల్ సభలో మోడీ అనంతకు కియా తెచ్చానని చెప్పకోలేదు కానీ.. జగన్ మాత్రం అదే పనిగా చెబుతున్నారు.  ప్రత్యేక హోదా కోసం మేకపాటి, వైవీ, వర ప్రసాద్ వంటి వారు త్యాగాలు చేశారని అంటోన్న జగన్.. వారికి ఎందుకు టిక్కెట్లివ్వలేదు' అంటూ ప్రశ్నలు సంధించారు.