200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ ...షబ్బీర్ అలీ

 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ ...షబ్బీర్ అలీ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి 200 యూనిట్ల విద్యుత్ వాడకానికి ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా చేయడంతో పాటు 9రకాల వస్తువులు ఇస్తామన్నారు. నిజామాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం, కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంప గోవర్థన్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. కామారెడ్డికి నీళ్లు తీసుకురావటం గంప గోవర్ధన్ కు ఇష్టం లేదని ఆరోపించారు. గంప గోవర్ధన్ 15 ఏళ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమి చేయలేకపోయారని ఆరోపించారు. 15 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా పేదలకు కట్టలేదన్నారు. ఒక్క కాలనీ కూడా అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఇన్నేళ్ళలో ఏం అభివృద్ధి చేశారని నిలదీయాలని ప్రజలకు సూచించారు. ఏమి చేయకుండానే  ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.  గంప గోవర్థన్ లాంటి వారిని గెలిపించడం అవసరమా అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏమిటో  చూపిస్తామని షబ్బీర్ హామీ ఇచ్చారు.