ఎమ్మెల్సీ ఏకగ్రీవం..!

ఎమ్మెల్సీ ఏకగ్రీవం..!

తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడమే తరువాయి. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల దాఖలు గడువు ముగిసిపోయింది. అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ రావు ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు... దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయినట్టే.. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 31వ తేదీన ప్రకటించనున్నారు.