షాకింగ్ న్యూస్? జియో బాటలోనే వొడాఫోన్ ఐడియా.. ఎయిర్‌టెల్..|

షాకింగ్ న్యూస్? జియో బాటలోనే వొడాఫోన్ ఐడియా.. ఎయిర్‌టెల్..|

తీవ్రమైన పోటీ, బకాయిలను ఎదుర్కొంటున్న భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా.. మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ఛార్జీలను త్వరలోనే పెంచనున్నాయి.. ఫస్ట్ వోడాఫోన్ ఐడియా ఒక ప్రకటనలో మూడేళ్లలో మొదటిసారిగా సుంకాలను పెంచే ప్రణాళికలను ప్రకటించింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్ నుంచి కూడా ఇదే తరహా స్టేట్‌మెంట్ వచ్చింది. టారిఫ్ పెంపు విషయంలో వొడాఫోన్ ఐడియా బాటలోనే భారతీ ఎయిర్‌టెల్ కూడా పయనిస్తుండగా.. డిసెంబరు 1వ తేదీ నుంచి టారిఫ్ ధరలను పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. 

అయితే, ఈ రెండు టెలికం సంస్థలు రేట్ల పెరుగుదలను ఎక్కడా ప్రకటించలేదు.. వచ్చే నెల నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుందని మాత్రం వెల్లడించాయి. సర్దుబాటు చేసిన స్థూల రాబడి కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వు వల్ల తలెత్తిన బాధ్యత కారణంగా, సెప్టెంబర్ 30 తో ముగిసిన రెండవ త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా గత వారంలో ఏకీకృత నష్టాన్ని 50,921 కోట్ల రూపాయల నష్టాన్ని నివేదించింది. తన కస్టమర్లు ప్రపంచ స్థాయి డిజిటల్ అనుభవాలను ఆస్వాదించడాన్ని కొనసాగించడానికి, వోడాఫోన్ ఐడియా దాని ప్లాన్స్ ధరలను తగిన విధంగా పెంచుతున్నట్టు పేర్కొంది. కాగా, టారిప్ ప్లాన్స్ కింద డేటాతో అన్ని నెట్‌వర్క్స్ కాల్స్‌ ఉచితంగా అందిస్తూ వచ్చిన రిలయన్స్ జియో కూడా గత నెల నుంచి ఇతర నెట్‌వర్స్‌ కాల్స్‌కి నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మిగతా టెలికం సంస్థలు కూడా ఇదే బాట పట్టబోతున్నాయా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు, టారిఫ్ ప్లాన్స్ మార్చి.. డేటా, కాల్స్ ప్లాన్స్ చార్జీలు పెంచే అవకాశం ఉందంటున్నారు.