145 రోజుల తరువాత కార్గిల్ లో... 

145 రోజుల తరువాత కార్గిల్ లో... 

ఆగష్టు 5 వ తేదీ దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు అని చెప్పొచ్చు.  ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉంచిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  పార్లమెంట్ లో దీనిని ఆమోదించి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించింది.  అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్రబలగాల ఆధీనంలోకి వెళ్ళింది.  జమ్మూ కాశ్మీర్ ను రెండు ముక్కలు చేశారు.  లడక్, జమ్మూ కాశ్మీర్ లుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు.  

ఆ తరువాత చాలాకాలం పాటు జమ్మూ కాశ్మీర్ లో అలజడులు జరిగాయి.  దాదాపు రెండు నెలల పాటు పాఠశాలలు తెరుచుకోలేదు.  కాగా, ఇటీవలే కేంద్ర బలగాలను ఉపసంహరించుకుంది.  70 వేల కేంద్రబలగాలను ఉపసంహరించుకున్నారు.  145 రోజుల తరువాత కార్గిల్ లో ఇంటర్నెట్ సౌకర్యం తిరిగి అందుబాటులోకి వచ్చింది.  ఈరోజు నుంచి కార్గిల్ లో ఇంటర్నెట్ ను అందుబాటులో ఉంచారు.