సెల్ ఫోన్ దొంగల ముఠా అరెస్ట్

సెల్ ఫోన్ దొంగల ముఠా అరెస్ట్

సెల్ ఫోన్ లను దొంగలిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం హైద్రాబాద్ సీపీ అంజనీ కుమార్ వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... గత కొద్ది రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ లను ఏర్పాటు చేస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సెల్ ఫోన్ లను దొంగలిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని 34 సెల్ ఫోన్ లను రికవరీ చేసుకున్నామని తెలిపారు. మొత్తం 8 మంది ముఠా సభ్యులుగా ఉండగా..  అందులో ముగ్గురు మైనర్లుగా ఉన్నారు. సయ్యద్, ఫేహాద్, మోహసీన్ అలం, జుబాయిర్, మొహమ్మద్ జుబాయిర్ లను అరెస్ట్ చేశామన్నారు. దొంగలించిన సెల్ ఫోన్ లను నగరంలోని జగదీష్ మార్కెట్, హాంకాంగ్ బజార్ లో అమ్ముతునట్టు తేలింది. కొంత మంది రిసివర్లుగా ఉన్నారు.. ఆయా వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.