ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే: కేసీఆర్

ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే: కేసీఆర్

ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడంపై ఎమ్మెల్యేలకు మాక్‌ పోలింగ్‌‌ కార్యక్రమాన్ని చేపట్టారు. రేపు ఉదయం 8:30 గంటల కల్లా ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ కు చేరుకోవాలి సీఎం తెలిపారు. రేపు మరోసారి మాక్‌ పోలింగ్‌‌ను నిర్వహించనున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌ నుంచి ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఎంఐఎంతో కలిపి 17 ఎంపీ స్థానాలు గెలవాల్సిందేనని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తాం. ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని సీఎం స్పష్టం చేశారు.

మాక్‌ పోలింగ్‌‌ అనంతరం తెలంగాణ భవన్ గేట్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు. ఈ నెల 17న కరీంనగర్‌లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ జరగనుంది. 19న నిజామాబాద్‌లో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభను సుమారు 2 లక్షల మందితో ఏర్పాటు చేశారు.