రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు: రాహుల్

రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు: రాహుల్

స్పష్టమైన మెజారిటీ లేకున్నా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడమంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తిమ్మినిబమ్మి చేసైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే బీజేపీ లక్ష్యం ముందు ప్రజాస్వామ్యం ఓడిపోయిందంటూ ట్వీట్‌ చేశారు. 'ఇవాళ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటారు..సంతోషంగా ఉంటారు.. కానీ.. ప్రజాస్వామ్యం ఓడిపోయిందని దేశం విచారం వ్యక్తం చేస్తుంది' అని అన్నారు.