ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గం... జాతి ప్రయోజనాలే ముఖ్యం... 

ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గం... జాతి ప్రయోజనాలే ముఖ్యం... 

కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ అమలు విషయంలో దేశంలో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో చెప్పక్కర్లేదు.  ఈ రెంటింటి వలన దేశం మతప్రాతిపదికన విడిపోతుందని, దేశంలోని మైనారిటీలకు ఇబ్బందులు వస్తాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.  కానీ, కేంద్రం మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. 

ఈ రెండు విషయాల కోసం దేశం ఎంతోకాలంగా ఎదురు చూస్తోందని, జాతి కోసం తీసుకున్న నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గే  ప్రసక్తి లేదని ప్రధాని మోడీ ఈరోజు వారణాసిలో స్పష్టం చేశారు.  వీటి విషయంలో తమపై ఒత్తిడి ఉందని, కానీ, ఒత్తిడి కంటే కూడా దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యం అని అన్నారు.  ఎంతో కాలంగా దేశం మొత్తం ఈ రెండు విషయాల కోసం ఎదురు చూస్తున్నట్టు మోడీ తెలిపారు.  వారణాసిలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మెమోరియల్ ట్రస్ట్ ను జాతికి అంకితం చేశారు.  ఆ ట్రస్ట్ లో ఏర్పాటు చేసిన 63 అడుగుల ఎత్తైన దీన్ దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  దేశంలో అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం.