నా సభను అడ్డుకుంటారేమో: మోడీ

నా సభను అడ్డుకుంటారేమో: మోడీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాన మంత్రి మోడీ విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో హింసకు మమతే కారణమని అన్నారు. ఇవాళ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ సంఘ సంస్కర్త విద్యాసాగర్‌ విగ్రహాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలే ధ్వంసం చేశారని అన్నారు. ఆ స్థానంలో విద్యాసాగర్‌ పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 'ఇవాళ సాయంత్రం బెంగాల్‌లో నా సభ ఉంది. నా సభను మమతా బెనర్జీ అడ్డుకునే అవకాశం ఉంది. నా హెలికాప్టర్‌ను మమత కిందకు దిగనివ్వకపోవచ్చు' అని మోడీ అన్నారు.  

గతంలో బెంగాల్‌లో తన సభను తృణమూల్‌ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో మధ్యలోనే వెనుదిరిగానని గుర్తు చేశారు. రెండు రోజు క్రితం అమిత్‌ సా రోడ్‌ షోను కూడా తృణమూల్‌ కార్యకర్తలే అడ్డుకుని దౌర్జన్యం చేశారని మోడీ ఆరోపించారు.