మహాబలిపురంలో మోడీ.. జిన్ పింగ్..!!

మహాబలిపురంలో మోడీ.. జిన్ పింగ్..!!

ప్రధాని మోడీ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈరోజు రేపు అయన రష్యాలో ఉంటారు.  పుతిన్ తో పాటు అక్కడి అధికారులతో మోడీ సమావేశం కానున్నారు.  రెండు రోజుల పర్యటన తరువాత మోడీ తిరిగి ఇండియా వస్తారు.  ఇదిలా ఉంటె, వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇండియాకు వస్తున్నారు.  

ఇండియాకు వచ్చిన తరువాత అయన వివిధ విషయాలపై చర్చలు జరిపే అవకాశం ఉన్నది.  మోడీ, జిన్ పింగ్ లు ఢిల్లీ లో కాకుండా ఢిల్లీ వెలుపల ఇద్దరు సమావేశం కానున్నారు.  ఇందులో భాగంగా వివిధ ప్రదేశాలను పరిశీలిస్తున్నారు.  అందులో ఒకటి తమిళనాడులోని మహాబలిపురం.  మహాబలిపురంలో ఈ ఇద్దరు సమావేశం కావడానికి అవకాశం ఉన్నది.  చైనా అధికారులు ఇటీవలే మహాబలిపురం వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించినట్టు తెలుస్తోంది.