మోడీ ఏపీ టూర్‌.. లైవ్‌

మోడీ ఏపీ టూర్‌.. లైవ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం గన్నవరం చేరుకున్న మోడీకి  గవర్నర్‌ నరసింహన్‌, సీఎస్‌ అనిల్‌ చంద్ర పునేఠ, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, విజయవాడ సీపీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని గుంటూరుకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. బీపీసీఎల్‌ కోస్టల్‌ టెర్మినల్‌ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఓఎన్‌జీసీ వశిష్ఠ, ఎస్‌1 అభివృద్ధి పథకాలను, విశాఖపట్నంలో భూగర్భ ముడిచమురు నిల్వ కేంద్రాన్ని అక్కడి నుంచే జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.