తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోడీ

తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోడీ

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్‌ చేశారు. షీలా దీక్షిత్ సహృదయురాలని, మృదుభాషి అని పేర్కొన్న మోడీ.. స్నేహపూర్వక వ్యక్తిత్వంతో ఆమె అందరినీ ఆకట్టుకునేవారని గుర్తు చేశారు.  ఢిల్లీ అభివృద్ధిలో షీలా దీక్షిత్‌ భాగస్వామ్యం ఎనలేనిదని అన్నారు. షీలా దీక్షిత్ కుటుంబానికి, ఆమె మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు. షీలా దీక్షిత్‌తో తాను కలిసి ఉన్న ఫోటోను ట్యాగ్‌ చేశారు మోడీ. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షీలా దీక్షిత్ ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు.