మోడీ మాయా బజార్ రెడీ...!

మోడీ మాయా బజార్ రెడీ...!

మోడీనా మజాకా.... నాలుగో వార్షికోత్సవ వేళ... మోడీ మీడియా మాయాజాలం తాండవం చేయనుంది. బీజేపీ తమ పథకాలను భారీగా ప్రచారం చేసుకునేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు డిజిటల్ మీడియాపై ఎక్కువ ఫోకస్ చేశారు. సోషియల్ మీడియాను వీలైనంత ఎక్కువగా వాడుకొని... దూసుకుపోవాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగమే"సాఫ్ నియత్, సహీ వికాస్". 

48 నెలలు వర్సెస్ 48 సంవత్సరాలు... ప్రచార ట్యాగ్‌లైన్ తో మోడీ నాలుగేళ్ల వార్షికోత్సవాన్ని నిర్వహించాలని కమలనాథులు నిర్ణయించారు. యూపీఏ పాలనలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనీ... 48 నెలల మోడీ పాలనలో అవినీతికి తావే లేదనే అంశాలను ప్రచారాస్త్రాలుగా 2019 ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. 48ఏళ్ల గాంధీ కుటుంబ పాలనలో అక్రమాలు జరిగాయని ముమ్మర ప్రచారం చేయనున్నారు. 

నాలుగేళ్ల బీజేపీ పాలనలో సాధించిన విజయాలపై శాఖల వారీగా వీడియోలు రూపొందించాలని ప్రధాని మంత్రులను ఆదేశించారు. తమ పాలనలో యువతకు కల్పించిన ఉద్యోగాల వివరాలను సైతం ప్రజలకు నివేదించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ముఖ్యంగా కమ్యునిటీ రేడియో, డిజిటల్ సినిమా, దూరదర్శన్ , ఇంటర్నెట్ , ఎస్ ఎంఎస్ టీవీలకు ఉపయోగించుకోనుంది. ప్రస్తుతం సోషల్ మీడియా రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ ఎప్పుడో పసిగట్టింది. అందుకే తమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయనుంది. మోడీకి అత్యంత ఇష్టమైన డిజిటల్ మీడియాపైనే ఈసారి బీజేపీ ఆధారపడనుంది.  

కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొందరికి కొన్ని అవసరంగా మారతాయి. మరికొన్ని ఆడంబరాలు తోడవుతాయి. మోడీని చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. అందులో ఆయనకు ప్రచార ప్రీతి బాగా ఎక్కువ. ఎన్నికల ముందు త్రీడీలలో హామీలు గుప్పించి ఆ తర్వాత కేవలం మీడియా ప్రచారంతో మభ్యపెట్టడానికి ఆయన సిద్ధపడుతున్నారనే వాదన ఉంది. దానికి తగ్గట్టుగానే తాజాగా లెక్కలు కూడా బయటపడ్డాయి. మోడీ ఏం చేసినా అది ప్రచారార్భాటంతోనే ఉంటుంది. అందుకే ప్రజావసరాల కన్నా పబ్లిసిటీకి ప్రాధాన్యతనిస్తారనే అపవాదు ఉంది. 

మోడీ ప్రభుత్వం ప్రచారం కోసం చేసిన ఖర్చు లెక్కిస్తే గుండెగుభేల్‌ అంటుంది.  ఈ నాలుగేళ్లలో ఆయన ప్రచారం కోసం ఏకంగా 4వేల 5వందల కోట్ల రూపాయలు. అంతకుముందు మన్మోహన్ సింగ్ సర్కారు పదేళ్లలో రూ. 930 కోట్లు ఖర్చు చేసింది. అంటే పదేళ్ల వ్యయం కన్నా నాలుగేళ్లలో మూడు రెట్లు అదనంగా ప్రచారానికి ఖర్చు చేశారు. దటీజ్ మోడీ.

ఇక తాజాగా నాలుగో వార్షికోత్సవం నాటికి తమ పథకాల ప్రచారం కోసం డిజిటల్ మీడియా, ప్రైవేటు రేడియో చానల్స్ పై ఎక్కువగా దృష్టి  పెట్టింది. ఇందుకోసం పీఎంఓ ఇప్పటికే అంతా సిద్ధం చేస్తోంది. సాఫ్ నియత్, సహీ వికాస్ పేరుతో బీజేపీ ప్రచారం చేయనుంది. నాలుగో వార్షికోత్సవ వేళ పథకాల ప్రచార పర్యవేక్షణ కోసం ఏకంగా 12మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. వారు దేశ వ్యాప్తంగా 40 నగరాల్లో తిరిగి ప్రచారం చేయాలి. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని వారి ప్రచారం సాగాలి.  ఆర్బాటాలకు తావులేకుండా ఏర్పాటు చూసుకోవాలి. 

ప్రధాని చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని లీడింగ్ ఆర్జేతో ప్రముఖ ఎఫ్ ఎమ్ చానల్స్ లో ప్రచారం చేయనున్నారు. మారుమూల ప్రాంత ప్రజలకు సైతం ప్రచారం చేరాలి. బీజేపేతర రాష్ట్రాలకు ప్రాధాన్యం. ఇందులో భాగంగానే తమిళనాట చెన్నై, కోయంబత్తుర్, మధురై  లాంటి నగరలను సెలెక్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలో రెండు నగరాలే. బీజేపీకి రాజకీయంగా కేరళ  టార్గెట్. అందుకే  భౌగోళికంగా చిన్నదైనా  రాజకీయంగా చాలా ప్రాధాన్యమున్న రాష్ట్రం కావటంతో.... రెండు నగరాల్లో ప్రచారం ప్లాన్ చేశారు. మొత్తానికి ఈ సోషియల్ మీడియా మానిటర్స్ దేశ వ్యాప్తంగా 716 జిల్లాలు లను సెలెక్ట్ చేసింది బీజేపీ. 


ఈ ప్రచార బాధ్యతలను ఏకంగా  ఓ డజను మంది మంత్రులుకు అప్పగించారు. పియూష్ గోయల్,  నిర్మాలా సీతారామన్, నడ్డా, సుష్మా స్వరాజ్ తో పాటు  నితిన్ గడ్కరీ ఈ బృందంలో ఉన్నారు.