కాశీవిశ్వనాథ ఆలయంలో మోడీ

కాశీవిశ్వనాథ ఆలయంలో మోడీ

ప్రధాని మోడీ ఇవాళ యూపీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు.  వారణాసి, కాన్పూర్, ఘజియాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజలు చేస్తున్నారు. ఉదయాన్నే వారణాసిలో కాశీవిశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన మోడీ.. అక్కడి రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 40 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. ఆలయం పేరు మీదుగా ఐదు ఇటుకలు పేర్చి పనులను ప్రారంభించారు.  ఇక.. కాన్పూర్‌లో పవర్ ప్లాంట్‌ను, లక్నోలో మెట్రో రైల్‌లోని కొంత భాగాన్ని వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తారు. ఆగ్రాలో మోట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చెస్తారు. వీటితోపాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.