మోడీ నాకు మంచి మిత్రుడు - జిన్ పింగ్ 

మోడీ నాకు మంచి మిత్రుడు - జిన్ పింగ్ 

నిన్నటి రోజున మోడీతో సమావేశం అయ్యేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇండియా వచ్చారు.  మహాబలిపురంలో ఇరువురు నేతలు సమావేశం అయ్యారు.  దాదాపు గంటకు పైగా శోర్ దేవాలయంలో సమావేశం జరిపారు.  అనంతరం సాయంత్రం సమయంలో మోడీ జిన్ పింగ్ కు ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. 

కాగా ఈ ఉదయం మోడీ, జిన్ పింగ్ లు కోవలంలో సమావేశం అయ్యారు.  రెండు దేశాల మధ్య శిఖరాగ్ర చర్చలు జరిగాయి, వాణిజ్య, అంతర్జాతీయ బోర్డర్ వంటి వంటి విషయాలపై చర్చలు జరిగాయి.  ఈ సమావేశంలో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు లేదు.  కేవలం వాణిజ్యం, సహకారం వంటివాటిపైనే చర్చలు జరిపారు.  అనంతరం జిన్ పింగ్ మీడియాతో మాట్లాడారు.  మోడీ మంచి మిత్రుడని, ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని జిన్ పింగ్ పేర్కొన్నారు.  కోవలం నుంచి జిన్ పింగ్ చైనాకు బయలుదేరి వెళ్లారు.