మోడీతో ముగిసిన కేసీఆర్‌ భేటీ..

మోడీతో ముగిసిన కేసీఆర్‌ భేటీ..

ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ ముగిసింది. ప్రధాన మంత్రి అధికార నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో దాదాపు 20 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. వెనుకబడిన జిల్లాలకు వాయిదా కింద 450 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని మోడీని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా తెలంగాణ వార్షిక రుణపరిమితిని మరో 0.50 శాతం పెంచాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం మిగులు ఆదాయం ఉన్న రాష్ర్టాలు జీఎస్‌డీపీలో 3.5 శాతం వరకు రుణ పరిమితి పొందవచ్చని సీఎం తెలిపారు. దీంతో వార్షిక రుణ పరిమితి పెంపునకు అవసరమైన అర్హతను తెలంగాణ సాధించిందని.. వరుసగా నాలుగో సంవత్సరం కూడా తెలంగాణ మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రంగా నిలిచిందని  కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రత్యేక హైకోర్టు, కొత్త జోనల్ వ్యవస్థ, బీసీ రిజర్వేషన్ బిల్లు, రక్షణ శాఖ భూముల బదలాయింపు, రీజినల్ రింగురోడ్డుకు నిధులు, ఐఐఎం, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు లాంటి అంశాలపై సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో చర్చించారు.