మోడీ సంచలన నిర్ణయం.. అక్టోబర్ 2 నుంచి మొదలు ..!!

మోడీ సంచలన నిర్ణయం.. అక్టోబర్ 2 నుంచి మొదలు ..!!

అక్టోబర్ 2 గాంధీ జయంతి.. ఆరోజు నుంచి దేశంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.  ఇప్పటి వరకు బహిరంగంగా మూత్ర విసర్జన చేసే వారి విషయంలో ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోలేదు.  గాంధీ జయంతి సందర్భంగా ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతున్నది.  బహిరంగంగా మూత్ర విసర్జన రహిత దేశంగా మార్చేందుకు సిద్ధం అయ్యింది. ఆరోజు నుంచి దేశంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని తెలుస్తోంది.  మన్ కి బాత్ లో మోడీ ఈ విషయం గురించి పేర్కొన్నారు.  మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా చాలా కీల నిర్ణయాలు తీసుకుంటున్నాం. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశాన్ని ఆయనకు అంకితమివ్వాలని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందనే.  ఇది జరగాలి అంటే చట్టాలు కఠినంగా ఉండాలి.  అంతేకాదు, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పేర్కొన్న ప్లాస్టిక్ రహిత భారత దేశం విషయంపై కూడా మోడీ మన్ కి బాత్ లో మాట్లాడారు. ప్లాస్టిక్ రహిత భారతదేశం అనే మాటను చాలామంది నేతలు స్వాగతించారు.  మిత్రపక్షాలే కాకుండా అటు ప్రతిపక్షంలోని సభ్యులు కూడా దీన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే.