మోడీ మన్ కీ బాత్...పెరుగుతున్న కేసుల నేపధ్యంలో మళ్ళీ లాక్ ?  

మోడీ మన్ కీ బాత్...పెరుగుతున్న కేసుల నేపధ్యంలో మళ్ళీ లాక్ ?  

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు పదకొండు గంటలకి మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆకాశ వాణి రేడియో ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కోవిడ్ అన్ లాక్ డౌన్ -1 ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ మన్ కీ బాత్ సందేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. లాక్ డౌన్ పేరిట ఎంత కట్టడి చేసినా ఈ అన్ లాక్ మొదలయ్యాక భయంకరంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఆయన మళ్ళీ లాక్ డౌన్ ప్రకటిస్తారని కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది.

అయితే ఇప్పటికే మళ్ళీ లాక్ డౌన్ లాంటిది ఏదీ ఉండదని ఆయన ప్రకటించారు. అయితే ఈ నేపధ్యంలో కరోనా కట్టడికి తీసుకోబోయే చర్యలపై ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్నారు. ఇక లాక్ డౌన్ దిశగా ప్రధాని ప్రసంగం ఉండబోతుందా లేక ఆర్థిక వ్యవహారాలు పరిగణలోకి తీసుకొని మరిన్ని సడలింపులతో అన్ లాక్ డౌన్-2 గురించి ప్రసంగించబోతున్నారా అనే విషయాల్లో క్లారిటీ రావాలంటే ప్రధాని మాట్లాడే వరకూ ఆగాల్సిందే. అలాగే సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలపై కూడా ప్రస్తావించే అవకాశం ఉందని భావిస్తున్నారు.