తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోడీ

తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోడీ

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్ర మోడీ.. ఇవాల తన తల్లి హీరాబెన్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవాళ గుజరాత్‌లో పర్యటించిన మోడీ.. కొద్ది సేపటి క్రితం గాంధీనగర్‌లోని తన తల్లి ఇంటికి చేరుకున్నారు. ఆమెను పరామర్శించి చిరు కానుక అందజేశారు. రెండు రోజుల క్రితం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. బీజేపీ ఏకంగా 303 సీట్లు సాధించింది.