మోడీ ఫ్యాన్స్‌కు ప్రియాంక షాక్‌..!

మోడీ ఫ్యాన్స్‌కు ప్రియాంక షాక్‌..!

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్న ఆమె.. సందర్భోచితంగా ప్రవర్తిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిన్న ఆమె కారులో వెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు 'మోడీ.. మోడీ.. మోడీ' అని గట్టిగా నినాదాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇటువంటి సమయంలో ఏ రాజకీయ నేతైనా రెచ్చిపోయి నోరు పారేసుకుంటుంటారు. కానీ ప్రియాంక హుందాగా వ్యవహరించారు. బీజేపీ కార్యకర్తలను చూసి కారు దిగారు. చిరునవ్వులు చిందిస్తూ బీజేపీ కార్యకర్తల వద్దకు వెళ్లి పలకరించారు. వారికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి.. ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.