ఇవాళ మోడీ నామినేషన్.. అంతా రెడీ..

ఇవాళ మోడీ నామినేషన్.. అంతా రెడీ..

వరుసగా రెండోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు వారణాసిలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తారు. ఉదయం 9 గంటలకు వారణాసిలోని ఓ హోటల్లో కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి  9.45 గంటలకు కాల భైరవ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం నామినేషన్ దాఖలు చేయడానికి కలెక్టర్‌ కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు. 

2014 సాధారణ ఎన్నికల్లో వారణాసితో పాటు వడోదర నుంచి పోటీ చేసి గెలిచిన మోడీ.. వడోదర నుంచి తప్పుకున్నారు. వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్ల తేడాతో మోడీ విజయం సాధించారు.