పార్లమెంట్ దాడి మృతులకు పలువురు నివాళులు

పార్లమెంట్ దాడి మృతులకు పలువురు నివాళులు

17 ఏళ్ల క్రితం భారత పార్లమెంట్ మీద ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. పార్లమెంట్ ఆవరణలో ఆనాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి పూల మాలలు వేసి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంట్ మీద టెర్రరిస్టులు దాడి చేయగా, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రదళాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.