తెలుగు బాలికలకు మోడీ ప్రశంస

తెలుగు బాలికలకు మోడీ ప్రశంస

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల బాలికలు దేశ గౌరవాన్నిఇనుమడింపజేశారని ప్రధాన మంత్రి మోడీ అన్నారు. ఇవాళ ఎర్రకోటపై  త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరం, ఉత్తరాఖండ్ బాలికలు ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆత్మవిశ్వాసాన్ని నలుదిశలా చాటారన్నారు. నవ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందని అన్నారు. దేశం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని, సాహసాన్ని సాకారం చేసే దిశగా దేశం శ్రమిస్తోందన్నారు.