మోడీకి సలహాలు ఇవ్వండి

మోడీకి సలహాలు ఇవ్వండి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాట్లాడేందుకు ప్రధాని మోడీ ప్రజల సలహాలను ఆహ్వానించారు. గత మూడేళ్లుగా మోడీ తన స్పీచ్ ను ఇదే విధంగా కొనసాగిస్తున్నారు. 
ఈ ఏడాది కూడా ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా మోడీ స్పీచ్ కోసం ప్రజల సలహాలు ఆహ్వానించారు. నరేంద్ర మోడీ యాప్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోరమ్ కి పంపాలని ప్రధాని ట్వీట్ చేశారు. రాబోయే రోజులు ఎలా ఉండాలో మీ ఐడియాల్లో తెలపాలని మోడీ కోరారు. గత మూడేళ్లుగా ప్రజల తమ ఐడియాలను "మై గవర్నమెంట్ పోర్టల్" ద్వారా షేర్ చేసేవారు. అందులో నుంచి కొన్ని ఐడియాలు ప్రధాని స్వీకరించి ప్రసంగించేవారు. అయితే... ఈ ఏడాది వేడుకల కోసం ఇప్పటికే కొన్ని ఐడియాలను ఆయన స్వీకరించారు. అందులో రేప్ కేసులపై మాట్లాడాలనీ కొందరూ, రిజర్వేషన్ విధానంపై మాట్లాడాలని మరికొందరు, విద్యా విధానంపై మాట్లాడాలనే ఇంకొందరు సలహాలు ఇచ్చారు. ఇది మోడీ ఐదో ఇండిపెండెన్స్ డే స్పీచ్.