నల్ల బెలూన్లతో నిరసనపై మోడీ ఛలోక్తులు..

నల్ల బెలూన్లతో నిరసనపై మోడీ ఛలోక్తులు..

చంద్రబాబు, లోకేష్‌ల అధికారం త్వరలోనే అంతం కాబోతోందని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ గుంటూరులో ఆయన మాట్లాడుతూ బాబుగారి తండ్రీకొడుకుల రాజకీయం ఇక చెల్లదని.. ప్రజలు వారిని తిరస్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు.  ఫ్లేటు ఫిరాయించి రెండోసారి ఎన్నికల్లో గెలవాలని బాబు అనకుంటున్నారని, తన కొడుకు లోకేష్‌ను రాజకీయాల్లో నిలదొక్కుకునేలా చేసేందుకు.. ప్రయాసపడుతున్నారని విమర్శించారు. ఇక.. తన పర్యటన సందర్భంగా బ్లాక్‌ బెలూన్స్‌తో టీడీపీ నిరసన తెలియజేయడం మోడీ చలోక్తులు విసిరారు.  ఏదైనా మంచి పని ప్రారంభించేటప్పుడు నల్ల చుక్కను దిష్టి తగలకుండా పెడతారని... ఇవాళ చంద్రబాబు నల్ల బెలూన్లు ఎగరేసి తమకు దిష్టి తీశారని అన్నారు.  ఇది తమకు శుభ పరిణామమే తప్ప చెడు కాదని మోడీ అన్నారు. చంద్రబాబు వాస్తవాలను ఫేస్‌ చేయలేరని.. అందుకే కాంగ్రెస్‌తో కలిశారని విమర్శించారు.