రేపు ఉదయం మోడీ కీలక ప్రకటన ?

రేపు ఉదయం మోడీ కీలక ప్రకటన  ?

రేపు స్వాతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆధార్ తరహాలో వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్ పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని పీఎంఓ వర్గాల నుండి అందుతున్న సమాచారం. దేశంలోని ప్రతి పౌరుడి హెల్త్ రికార్డులను డిజిటైజ్ చేసి,  మెడికల్ హిస్టరీ మొత్తాన్ని హెల్త్ కార్డ్ లో నిక్షిప్తం చేయనున్నట్టు చెబుతున్నారు. అలానే ప్రతి వ్యక్తి చేయించుకున్న టెస్టులు, తీసుకున్న ట్రీట్మెంట్ వివరాలన్నీ ఈ కార్డులో సేవ్ చేయనున్నారు. ఆసుపత్రులు, క్లినిక్స్, డాక్టర్ల వివరాలను కూడా ఒక సర్వర్ తో లింక్ చేస్తారు. అయితే ఆధార్ లా కాకుండా ఈ స్కీమ్ ను ఉపయోగించుకోవాలా ? వద్దా? అనేది ప్రజల సొంత నిర్ణయానికే వదిలేస్తారు. ఆరోగ్య ముఖచిత్రంలో మార్పు తీసుకురావాలన్నదే ఈ స్కీమ్ ముఖ ఉద్దేశమని చెబుతున్నారు. ఈ స్కీమ్ కోసం మొదటి దశలో రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరపనున్నట్టు సమాచారం.