ట్రంప్ తో భేటీ కానున్న ప్రధాని మోడీ

ట్రంప్ తో భేటీ కానున్న ప్రధాని మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. మోడీ ప్రస్తుతం జీ-7 దేశాల భేటీలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. జి-7 దేశాల సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ఆహ్వానం మేరకు మోడీ సదస్సుకు హాజరయ్యారు. ఈ నేపధ్యంలో మోడీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. భారత్‌లో అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని ట్రంప్‌ మోడీని కోరనున్నట్లు అధికారుల నుండి అందుతున్న సమాచారం. తమ వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని ట్రంప్‌ కోరనున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఇరువురి నేతల మధ్య 40 నిమిషాల పాటు చర్చలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.