ప్రధాని మోడీ వల్లే ఏపీకి కియా మోటార్స్ 

ప్రధాని మోడీ వల్లే ఏపీకి కియా మోటార్స్ 

ప్రధాని నరేంద్రమోడీ వల్లే ఆంధ్రప్రదేశ్ కు కియా మోటార్స్ వచ్చిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కియా మోటార్స్ కు చంద్రబాబుకు సంబంధంలేదని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఎవై) పథకం కింద లక్షల ఇళ్లను నిర్మిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సిగ్గులేకుండా రాష్ట్ర ప్రభుత్వం  పేర్లు మారుస్తుందని ఆరోపించారు. అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు ఏకాకిలా ‌మిగిలిపొయారని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు కలుపుకోలేని చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి ఏం పోరాడుతారని ప్రశ్నించారు. 

చంద్రబాబు దుబారా చేస్తున్న సొమ్ము ప్రజలది. సోకులు  చేసుకోవడానికి కాదు. కేంద్రం ప్రకటించిన రూ. 900 కోట్ల నిధులను కరువు ప్రాంతాలకే వాడాలి. ఈ ఖర్చులపై నిఘా ఉంటుంది. కేంద్రం ఇచ్చిన నిధులను ఎంత ఖర్చు చేశారో.. ప్రజలకు ఎందుకు చెప్పరు. నాలుగున్నారేళ్లు జులాయిగా తిరిగి ఇప్పుడు కష్టపడుతున్నానని చంద్రబాబు చెప్పడం హస్యాస్పదం. టీడీపీలో చేరేవారంతా ప్యాకేజీల కోసమే... అని ఎంపీ జీవీఎల్ ఘాటుగా విమర్శించారు.