టీమిండియా ఓటమిపై మోడీ స్పందన

టీమిండియా ఓటమిపై మోడీ స్పందన

వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో టీమిండియా పరాజయం పాలవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఫలితం నిరాశపరిచినా.. చివరి వరకూ పోరాడడం అభినందనీయమని అన్నారు. ఈమేరకు కొద్ది సేపటి క్రితం ఆయన ట్వీట్‌ చేశారు. 
'ఫలితం నిరాశపర్చింది. కానీ.. విజయం కోసం చివరి వరకు పోరాడడం అభినందనీయం. టోర్నీ మొత్తం భారత్‌ జట్టు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో రాణించింది. అందుకు గర్వంగా ఉంది. జీవితంలో గెలుపొటములు సహజం. భవిష్యత్తులో జరిగే టోర్నీలో పాల్గొనబోతున్న భారత జట్టుకు ఆల్‌ ద బెస్ట్'