దశల వారిగా లాక్ డౌన్ ఎత్తివేత..ఎంపీ లతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ దృశ్యాలు లీక్!

దశల వారిగా లాక్ డౌన్ ఎత్తివేత..ఎంపీ లతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ దృశ్యాలు లీక్!

ప్రస్తుతం దేశంలో ప్రధాని పిలుపునిచ్చిన లాక్ డౌన్ పీరియడ్ ముగుస్తుండటంతో ఆ తరవాత పొడిగిస్తారా లేదా అన్నది చర్చగా మారింది. ఈ నేపథ్యంలో మోడీ ఎంపీ లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ దృశ్యాలు  లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్లిప్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ పాల్గొనగా మరో స్క్రీన్ పై నుంచి మోడీ  మాట్లాడుతున్నారు. వీడియోలో ఉన్న సమాచారం  ప్రకారం..ప్రస్తుతం ఇండియాలో సోషల్ ఎమర్జెన్సీ తరహాలో అసాధారణ స్థితి నెలకొనివుందని వ్యాఖ్యానించిన మోడీ  కరోనాను గెలవాలంటే  సామాజిక దూరం పాటించడమే ఏకైక మార్గమని అన్నారు. లాక్ డౌన్ ను తొలగించే విషయమై మరోమారు ఆలోచించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు కోరుతున్నారని, తాను కూడా ఒకేమారు లాక్ డౌన్ ను తొలగించే ఆలోచన చేయడం లేదని మోదీ వ్యాఖ్యానించారు. వీడియోలో ప్రధాని దేశ ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని స్పష్టం చేసారు. కాగా వీడియోను టీఎంసీ కావాలనే లీక్ చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి.