మోడీజీ... సౌత్ వైపు చూడండి..జై హింద్

మోడీజీ... సౌత్ వైపు చూడండి..జై హింద్

గాంధీ మహాత్ముడి 150 వ జయంతి సందర్భంగా కేంద్రం ఎన్నో కార్యక్రమాలను రూపొందించింది.  ప్రధానంగా అక్టోబర్ 2 వ తేదీ నుంచి దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని చోట్ల దీనిని అమలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.  అయితే, అది కేవలం ఒక్కరి వలన సాధ్యం అయ్యే విషయం కాదు.  

ప్రతి ఒక్కరి సహకారం అవసరం.  ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన తరాల అవసరం చాలా ఉంటుంది.  ఒక్కో స్టార్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.  వాళ్ళు చెప్తే ప్రతి ఒక్కరు వింటారు.  మహాత్మాగాంధీ 150 వ జయంతి సందర్భంగా కొన్ని విషయాలను చర్చించేందుకు బాలీవుడ్ సెలెబ్రిటీలతో నిన్నటి రోజున ప్రధాని మోడీ ఓ సమావేశం ఏర్పాటు చేశారు.  మహాత్మాగాంధీ గురించి అయన కలను గురించి మోడీజీ వారితో పేర్కొన్నారు.  చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు.  అందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఒకే చెప్పారు.  కాగా, ఇదొక మంచి పరిణామం అని, సెలెబ్రిటీలతో మీట్ అయ్యి వారిని కూడా దేశంలోని మంచి పనులలో భాగస్వామ్యం చేయడం గొప్ప విషయం అని, అయితే, కేవలం బాలీవుడ్ బాలీవుడ్ సెలెబ్రిటీలను మాత్రమే ఇన్వాల్వ్ చేయడం బాధాకరంగా ఉందని, సౌత్ సినిమా ఇండస్ట్రీ వైపు కూడా చూడాలని, సౌత్ ఇండస్ట్రీని కూడా ఇలాంటి మంచి పనుల్లో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నట్టు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నది.  మరి మోడీజీ సౌత్ వైపు చూస్తారా.. సౌత్ స్టార్లతో కూడా అలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తారా చూద్దాం.