కోహ్లీ కంటే అతని వికెట్ ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది : అమీర్

కోహ్లీ కంటే అతని వికెట్ ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది : అమీర్

పాకిస్తాన్ పేస్ బౌలర్ మహ్మద్ అమీర్ క్రికెట్ మైదానంలో భారత ఆటగాళ్లతో కొన్ని గొప్ప పోరాటాలు చేశాడు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ లేకపోవడం వల్ల అమీర్ భారత్ కు వ్యతిరేకంగా అంత ఎక్కువగా తన నైపుణ్యాలను పరీక్షించలేక పోయినప్పటికీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వంటి వారిని ఐసీసీ ఈవెంట్లలో ఎదుర్కున్నాడు. అయితే  పాకిస్తాన్ జర్నలిస్ట్ తో జరిపిన సంభాషణలో, క్రికెట్ మైదానంలో ఔట్ చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్న బాట్స్మెన్ ను ఎంపిక చేసుకోవడం గురించి అమీర్‌ను అడిగారు. అతను విరాట్ కోహ్లీని ఎంచుకుంటారని చాలామంది భావించారు ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బాట్స్మెన్ గా కోహ్లీ ఉన్నాడు. కానీ అమీర్ భారత పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంచుకున్నాడు. భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన 2017 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో రోహిత్‌ అమీర్‌కు బాధితుడు అయ్యాడు. అయితే నేను అతన్ని ఎప్పుడూ సాధారణ బ్యాట్స్మాన్ అని పిలవను, నిజానికి నేను అతన్ని అసాధారణ బ్యాట్స్మాన్ అని పిలుస్తాను. భారతదేశానికి అతని రికార్డు అద్భుతమైనది మరియు నేను అతనిని గౌరవిస్తాను అని అమీర్ తెలిపాడు.