బీదర్ బరిలో అజారుద్దీన్ ?

 బీదర్ బరిలో అజారుద్దీన్ ?

కర్ణాటకలోని బీదర్ పార్లమెంట్ స్ధానం నుంచి టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ అజారుద్దీన్ ను పోటీ చేయించేందుకు స్ధానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ స్ధానాన్ని మైనార్టీలకు కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. బీదర్ పరిధిలో మైనార్టీల సంఖ్య అధికం. అందుకే అజారుద్దీన్ ను బరిలోకి దింపితే విజయం సునాయాసమవుతుందని వారి అభిప్రాయం. మరో వైపు ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రే కూడా బీదర్ సీటుపై కన్నేశారు. అధిష్టానం ఆదేశిస్తే.. అక్కడి నుంచి పోటీకి సిద్దమని ప్రకటించారు.